Friday, 24 February 2017

మొక్కు తీర్చుకున్న సీఎం కేసీఆర్‌

కురవి వీరన్నకు బంగారు మీసాలు సమర్పణ
మొక్కు తీర్చుకున్న సీఎం కేసీఆర్‌

మహబూబాబాద్‌ జిల్లాలోని కురవి వీరభద్రస్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు దర్శించుకున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని కురవికి వెళ్లి వీరభద్రస్వామికి బంగారు మీసాలు సమర్పించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో ఆయన కురవి చేరుకున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కురవికి వెళ్లినప్పుడు ప్రత్యేక రాష్ట్రం వస్తే వీరభద్రుడికి బంగారు మీసాలు సమర్పిస్తామని కేసీఆర్‌ మొక్కుకున్నారు.కురవి వీరభద్రుడికి మొక్కు చెల్లించుకున్నారు.

No comments:

Post a Comment